Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిక్విడ్ జ్యూస్‌లు.. అన్ని రకాల పండ్లు ఆరగిస్తే బరువు తగ్గొచ్చు.. ఎలా?

Written By chitra
Updated: గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:12 IST)
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువు తగ్గేందుకు అనేక విధాలైన డైట్ విధానాలను పాటిస్తుంటారు. వీటితో పాటు చిన్నపాటి టిప్స్‌ను పాటిస్తే చాలు కొంతమేరకు బరువు తగ్గే అవకాశం ఉందని న్యూట్రిషన్స్ చెపుతున్నారు. 
 
ముఖ్యంగా బరువు తగ్గాలంటే పూర్తిగా మానేయాల్సిన ఆహారం బటర్‌, చీజ్‌, చాకొలెట్‌, కేక్స్‌, మీగడ, వేపుళ్లు, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉన్న బ్రెడ్‌, కుకీలు, బంగాళాదుంపలు, పంచదార వంటివి. అలాగే, లిక్విడ్స్‌ లేదా జ్యూస్‌లను వారం నుంచి పది రోజులు తాగాలి. దాంతోపాటు నాలుగు లేదా ఐదు రోజులు అన్ని పండ్లు తినాలి. 
 
ఆరెంజ్‌, ద్రాక్ష, నిమ్మ, క్యాబేజి, సెలరీలను లిక్విడ్‌ డైట్‌లో భాగంగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉపవాసం పూర్తయ్యాక సమతులాహారాన్ని తీసుకోవాలి. అందులో గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు, నట్స్‌, తాజా జ్యూస్‌లు తప్పక ఉండాలి. ఇలా చేయడం వల్ల తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండొచ్చు. 
 
సహజ ఆహారాన్ని తీసుకోవాలి. సైక్లింగ్‌, వాకింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి బరువుని అదుపులో ఉంచుతాయి. యోగ, శ్వాస సంబంధిత వ్యాయామాలు బరువు తగ్గించడంలో, తగ్గిన బరువు పెరగకుండా ఉంచడంలో సాయపడతాయి. 

అన్నీ చూడండి

మమతా బెనర్జీ కారుపై దాడి - వీడియో వైరల్

ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రాహుల్ గాంధీ

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ ప్రకటనలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు

ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments