ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.....
ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు, వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనక ఓంకార నాదమే రహస్యం. విదేశాల్ల
ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు, వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనక ఓంకార నాదమే రహస్యం. విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది.
నాభిలోనుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం పదిహేను నిముషాల పాటు ఉచ్ఛరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం అదే. దీన్ని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది.