ఉల్లిపాయ పొట్టుతో ఎన్ని ప్రయోజనాలో...

ఉల్లిపాయలను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. పచ్చి ఉల్లిపాయలను మాంసాహారం, పప్పు వంటి వంటకాల్లో ఎక్కువగా తీసుకుంటారు. ఈ క్రమంలో ఉల్లిపాయలే కాదు వాటిపై ఉండే పొట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి

Written By Kowsalya
Updated: బుధవారం, 25 జులై 2018 (15:00 IST)
ఉల్లిపాయలను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. పచ్చి ఉల్లిపాయలను మాంసాహారం, పప్పు వంటి వంటకాల్లో ఎక్కువగా తీసుకుంటారు. ఈ క్రమంలో ఉల్లిపాయలే కాదు వాటిపై ఉండే పొట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఈ పొట్టుతో ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.
 
ఈ ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటిని ఉపయోగించుకోవచ్చును. ఆ నీటిని నొప్పులు, వాపులు ఉన్నచోట రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఈ ఉల్లిపొట్టును వేసి కిటికీలు లేదా గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు. ఈ పొట్టును సూప్‌లా తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుటకు ఉపయోగపడుతుంది. 
 
తద్వారా అధిక బరువు తగ్గడమే కాకుండా గుండె సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ ఉల్లిపొట్టు సూప్‌లో యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్ వ్యాధులు దరిచేరవు. ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తలస్నానం చేసేటప్పుడు జుట్టును ఈ ఉల్లిపాయ పొట్టు నీటితో మర్దన చేసుకుని ఆ తరువాత షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
About Author
Kowsalya

అన్నీ చూడండి

జూలై 29, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం... తెలంగాణలో చల్లచల్లగా.. ఏపీలో ఉక్కపోత

భార్యపై అనుమానం, నీ కూతురు చావును కళ్లారా చూడండి, ఉరి వేసి అత్తమామలకు అల్లుడు వీడియో కాల్

7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?

ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డా

జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?

అన్నీ చూడండి

G.V. Prakash Kumar: షీ ఈజ్ మై అంటూ కయదు లోహర్ ను కిస్ చేస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్

Ravi Teja : తండ్రీ-కూతుళ్ల అనుబంధం తో రవితేజ....ఇరుముడి

Naga Chaitanya: కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను : నాగచైతన్య

Vishal : విశాల్ హీరో, దర్శకుడిగా చేస్తున్న చిత్రం మకుటం నుంచి సాంగ్ రిలీజ్

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం శ్రీ శ్రీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments