పొటాషియం ఎక్కువగా తీసుకుంటే.. రక్తపోటుకు చెక్ పెట్టవచ్చట!
రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువ-పొటాషియం ఎక్కువుండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో చెక్ చేసుకోవాలి.
ఎందుకంటే.. గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గించుకోవాలంటే.. పొటాషియం ఎక్కువగా తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఉప్పును కూడా బాగా తగ్గించాలంటున్నాయి.
కేవలం నాలుగువారాలు ఉప్పు వాడకం తగ్గించినా కూడా.. రక్తపోటు తగ్గుతోందని... పొటాషియం ఎక్కువ తీసుకోవడం ఇంకా మంచిదని ఈ పరిశోధనలు చెబుతున్నాయి.
అధికంగా ఉప్పు వినియోగంతో ప్రమాదాలు పెరుగుతుండగా, పొటాషియం రక్తపోటు తగ్గిస్తోందిట. దీనివల్ల 23 శాతం పక్షవాతం ప్రమాదం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మీ ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు తీసుకోవాలి.