వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఇలాంటి స్నాక్స్ తీసుకోవాలి..

బుధవారం, 29 జులై 2020 (14:59 IST)
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అయితే ఇలాంటి ఆహారం తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఇంట్లో వుంటే ఏవో చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు హెల్దీ స్నాక్స్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఓట్స్, నట్స్‌ తీసుకోవాలి. వేపిన బఠాణీలు తీసుకోవాలి. అలాగే వేపిన బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. 
 
వేపిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే మంచిదే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మధ్య మధ్యలో వీటిని తింటే రిలాక్స్ అవడమే కాకుండా.. ఆకలి కూడా తీర్చుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోంలో ఆకలి తీర్చే మరో హెల్తీ ఫుడ్ పప్పులు. అంటే డ్రై నట్స్. బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశనగ గింజలు వంటివి ఆకలిని తగ్గిస్తాయి. చక్కటి ఎనర్జీ ఇస్తాయి. ఇంటి దగ్గర పనిచేసేవారు డ్రైఫ్రూట్స్, పప్పుల వంటివి తినడం తేలికగా ఉంటుంది. 
 
ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, రెండ మూడు జీడిపప్పు గింజలు, వాల్ నట్స్, ఫిగ్స్ వంటివి మధ్య మధ్యలో తింటే... ఆకలికి చెక్ పెట్టినట్లవుతుంది. పైగా ఇవి బాడీలో చెడు కొవ్వును కూడా తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్లు కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్, ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాకొలెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
పని చేసీ చేసీ అలసటగా ఫీలైతే... ఓ డార్క్ చాకొలెట్ తింటే చాలు. వెంటనే మూడ్ మారుతుంది. ఈ చాకొలెట్లు రోజుకొకటి తింటే పర్వాలేదు... ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
 
ఈ మధ్య ఎక్కువమంది ఓట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఓట్స్, బార్లీ ఫ్లేక్స్‌కి వీట్, రాగి ఫ్లేక్స్ కలిపి తింటే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇవి మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పుకోవచ్చు.
 
ఎనర్జీ పెరగాలంటే... మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తాయి కూడా. ఓట్స్ : ఈమధ్య ఎక్కువ మంది ఓట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి.

అన్నీ చూడండి

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అమరావతిపై కోర్టును ఆశ్రయించనున్న విజయ్ సాయి రెడ్డి.. సిగ్గు సిగ్గు.. అంటూ ఫైర్

హమ్మయ్య.. రుషికొండను అలా ఉపయోగించనున్న ఏపీ సర్కారు?

గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఉత్తరాదిన కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ముంబైలో మూడు రోజుల వర్షానికి నలుగురు మృతి

అన్నీ చూడండి

కామాఖ్య నుంచి హార్ట్ ఫుల్ మెలోడీ ఏముందో ఏమో సాంగ్ రిలీజ్

జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం విడుదల తేదీ ఖరారు

ఫస్ట్ డే నాగ బంధం, రావు బహదూర్ ఓపెనింగ్స్ రిపోర్ట్

Samantha recored: మా ఇంటి బంగారం తో బాక్సాఫీస్ రికార్డును అధిగమించిన సమంత రూత్ ప్రభు

Ntr: అఖిల్ అక్కినేని 'లనిన్ ట్రైలర్‌కు టాలీవుడ్ తారల మద్దతు

తర్వాతి కథనం
Show comments