బుధవారం, 15 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 1 మే 2024 (23:31 IST)

ఇంట్లోని దోమల బెడదను వదిలించుకునేందుకు చిట్కాలు

mosquito
మార్కెట్‌లో అనేక రకాల దోమల నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా సార్లు అవి ప్రభావవంతంగా పనిచేయవు. అంతేకాదు వాటిని వెలిగించడం కూడా ఆరోగ్యానికి హానికరం. కనుక ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రానీయకుండా దోహదపడే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
 
దోమల నివారణకు నిమ్మ, కర్పూరం, లవంగాలు, దూది, ఆవాల నూనె అవసరం.
ఒక నిమ్మకాయ, 3 నుండి 4 లవంగాలు తీసుకోండి, దీనితో పాటు దూది, ఆవాల నూనె, కొంత కర్పూరం కూడా తీసుకోండి.
కత్తి సహాయంతో, నిమ్మకాయను పైభాగంలో వృత్తాకారంలో కత్తిరించండి.
నిమ్మకాయను మధ్య నుండి కత్తిరించవద్దు, పై భాగం మాత్రమే.
ఇప్పుడు ఒక చెంచా సహాయంతో, నిమ్మకాయ లోపలి భాగాన్ని బయటకు తీయండి.
ఇప్పుడు నిమ్మకాయలో ఆవాల నూనె, లవంగం, కర్పూరం వేయాలి. అందులో వత్తిని ఉంచి అగ్గిపుల్లతో వెలిగించండి.
మీ ఇంటి కిటికీలు, తలుపులు అన్నీ మూసేయండి.
ఈ పొగ వాసనకు దోమలు తట్టుకోలేవు, అవి చనిపోతాయి.
రాత్రి పడుకునే ముందు నిమ్మకాయ- ఆవాల నూనెతో వెలిగించిన ఈ దీపాన్ని ఒక మూలలో ఉంచవచ్చు.
దీంతో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా తదితర వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.