గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 ఏప్రియల్ 2024 (16:12 IST)

వేసవిలో శరీరం నుండి నీటిని గ్రహించే ఈ పదార్థాలు తినరాదు

Food Varieties
వేసవిలో డీహైడ్రేషన్ సర్వసాధారణం. ఈ క్రింద చెప్పుకునే పదార్థాలను తీసుకోవడం వల్ల మీ శరీరంలో సులభంగా డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీనికి గల కారణాలను ఏమిటో తెలుసుకుందాము.
 
వేసవిలో మసాలాలతో కూడిన స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
ఈ స్పైసీ ఫుడ్ వల్ల డీహైడ్రేషన్, శరీరంలో వేడి పెరగడం, అజీర్ణం, అసౌకర్యం కలుగుతాయి.
వేసవిలో కాఫీని సాధ్యమైనంత వరకూ తాగకపోవడమే మంచిది.
కాఫీ తాగటం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి ఉష్ణోగ్రత పెరుగుతుంది.
వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినడాన్ని కూడా తగ్గించుకోవాలి.
వేయించిన ఆహారం తినేవారిలో శరీరం నిర్జలీకరణానికి కారణమవుతుంది.
ఎండాకాలంలో ఊరగాయలు డీహైడ్రేషన్‌ను కలిగిస్తాయి కనుక వాటిని తినరాదు.