డైట్, వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా.. గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిల్ని చెక్ చేసుకోండి

డైట్‌లో ఎలాంటి చిట్కాలు పాటించినా.. బరువు తగ్గట్లేదా? ఇందుకు కారణం ఏమిటో తెలుసా? తెలుసుకోండి మరి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని బాధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి రకరకా

ఆదివారం, 14 ఆగస్టు 2016 (13:10 IST)
డైట్‌లో ఎలాంటి చిట్కాలు పాటించినా.. బరువు తగ్గట్లేదా? ఇందుకు కారణం ఏమిటో తెలుసా? తెలుసుకోండి మరి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని బాధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నోరు కట్టేస్తుంటారు. నోరు కట్టేసుకున్నా వ్యాయామం చేసినా బరువు తగ్గకపోవడానికి అసలైన కారణాన్ని వైద్యులు కనుగొన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడానికి అసలు కారణం ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’.
 
ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ అంటే ఇన్సులిన్‌కు శరీరం తగిన విధంగా స్పందించకపోవడం. మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారుతుందన్న సంగతి తెలిసిందే. అలా మారిన గ్లూకోజ్‌ రక్తంలో ఎక్కువగా ఉండిపోతే ‘పాంక్రియాస్‌’ అనే గ్రంథి ఇన్సులిన్‌ను విడుదల చేసి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. అయితే అధిక స్థాయిలో కార్బోహైడ్రేట్‌ ఆహారం తీసుకోవడం, శారీరకంగా శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఇన్సులిన్‌ ప్రభావవంతంగా పనిచేయలేదు.
 
అప్పుడు శరీరం మరింత ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలా అధిక స్థాయిలో విడుదలైన ఇన్సులిన్‌ కొవ్వు కరగడాన్ని నిరోధిస్తుందట. దీని వల్ల ఓ వ్యక్తి ఎంత వ్యాయామం చేస్తున్నా, తిండి తగ్గించినా ఫిజికల్‌గా మాత్రం బరువు తగ్గడం ఉండదట. అలాగే శరీరంలో వెంటవెంటనే గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ స్థాయిలు మారడం కూడా అధిక బరువుకు కారణమవుతుందట. ఎంత ఎక్కువగా కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తీసుకుంటే శరీరం అంత ఎక్కువగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

జూలై 2, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే?

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments