శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 డిశెంబరు 2020 (21:47 IST)

గులాబీ రేకులు, బాదంపపప్పు పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే?

పుష్పాలలో గులాబీలకు ప్రత్యేక స్థానం వుంది. అందమైన పువ్వులుగా వీటికి ప్రసిద్ధి. వీటిలో ఔషధ గుణాలు కూడా పుష్కలం. అవేమిటో చూద్దాం. గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులాబ్‌-జల్‌ని తయారుచేస్తారు. ఇది కంటి జబ్బులకి దివ్యౌషధంగా పని చేస్తుంది.
 
అలాగే ప్రతిరోజు భోజనానంతరం గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది. గులాబీలతో తయారుచేసే గుల్కండ్‌ జలుబుని తక్షణం నివారిస్తుంది. కోల్డ్‌ టానిక్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. గర్భిణులు దీనిని రెండు వెూతాదులుగా తీసుకుంటే వారిలోని ఉష్ణం తగ్గుముఖం పడుతుంది. రోజూ రెండు గ్రాముల గులాబీ రసం తీసుకుంటే పిత్తాశయ వికారాలు తగ్గి ఆరోగ్యం యథాస్థాయికి చేరుతుంది.
 
గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ సౌందర్య సాధనాల్లో వుపయోగిస్తున్నారు.
 
గులాబీ రేకులు, బాదంపపప్పు పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది. శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరానికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది.
 
గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టుకుంటే మెదడు చల్లబడటమే కాక జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గులాబీలని హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటి నుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశమింప చేస్తుంది.