మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (19:17 IST)

బిపి వున్నవాళ్లు పుట్టగొడుగులు తింటే ఏమవుతుంది? (video)

వర్షాకాలం రాగానే పుట్టగొడుగులు మార్కెట్లో లభిస్తాయి. ఈ పుట్ట గొడుగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు పుట్టగొడుగులు చక్కగా పనిచేస్తాయి. ఈ పుట్టగొడుగులో విటమిన్ బి6, సి, డి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి పుట్టగొడుగులు చాలా ఉపయోగపడుతాయి.
 
ఈ పుట్టగొడుగులు తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో రకరకలుగా ఉంటాయి. ఆయుర్వేద భావప్రకాశ సంహితలో పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగినవి తెల్ల రంగులో ఉన్నవి తినడానికి యోగ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పేడ దిబ్బలపై మొలుస్తుంటాయి. అవి తెల్లగా ఉంటే అంతగా దోషకరం కావు కాబట్టి వాటిని కూడా తినొచ్చు.
 
ఇతర రకాలైన పుట్ట గొడుగులు ఎక్కువ జిగురుగా ఉండి, అత్యంత శీతకరమై కఫాన్ని వృద్ధిచేయడమే కాకుండా వాంతులు, విరేచనాలు, జ్వరాలు వంటి సమస్యల నుండి కాపాడుతాయి. కాబట్టి పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
పుట్ట గొడుగులు వండుతున్నప్పుడు నల్లగా మారిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిపై రెండు చెంచాల గోరువెచ్చని పాలు కాస్త పోయండి, లేదా ముందుగానే కాస్త ఉప్పు చల్లండి.