శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 20 అక్టోబరు 2020 (21:55 IST)

బిపి, మధుమేహం తగ్గడానికి ఇది తింటే..?

ఉల్లికాడలలో ఉన్న క్రోమియం మధుమేహాన్ని అదుపుచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అందువల్ల ఉల్లికాడలను తీసుకుంటూ వుండాలి. అలాగే జలుబు, జ్వరంతో బాధపడేవారు ఉల్లికాడలను తీసుకుంటే అందులో వుండే యాంటీ-బాక్టీరియల్ లక్షణం వల్ల ఉపశమనం కలుగతుంది.
 
కీళ్ళనొప్పులు, ఉబ్బసం వున్నవారు ఉల్లికాడలు తీసుకుంటుండాలి. ఎందుకంటే ఉల్లికాడల్లో వుండే క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు బాగా సహాయపడుతుంది.
 
ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో వుండే సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.