శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (16:36 IST)

PPని ఇంటి నుంచి తరిమికొట్టిన వనితా విజయ్ కుమార్, గోవాలో అలా చేశాడనీ...

వనితా విజయ్ కుమార్ తన భర్త PP(పీటర్ పాల్)ను ఇంటి నుంచి తరిమికొట్టిందనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం అవుతోంది. జూన్ నెలలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్నప్పటికీ పీటర్ పాల్‌ను ఆమె మూడో వివాహం చేసుకున్నారు. ఇది తెలిసిన వెంటనే పీటర్ పాల్ భార్య కోర్టులో కేసు వేసింది.
 
తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లాడడనీ, న్యాయపరంగా వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగానే తేల్చుకుంటానని చెప్పిన వనితా విజయ్ కుమార్ ఇటీవలే తన భర్త PPతో కలిసి గోవా వెళ్లింది. అక్కడ తన పిల్లలతో కలిసి పీటర్‌తో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి.
 
ఐతే చెన్నై రాగానే PPని ఇంటి నుంచి గెంటేసిందట వనిత. గోవాలో అతడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనీ, దాంతో అతడిని కొట్టినట్లు సమాచారం. దీనితో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తిందట. చెన్నై వచ్చినప్పటికీ PP అదే పనిగా మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టిందట వనిత. మరి ఇందులో ఎంత నిజం వుందో తెలియాలంటే వనితా విజయ్ కుమార్ స్పందిచాల్సిందే.