చలికాలంలో వేడినీటి స్నానం అస్సలొద్దు.. చర్మానికి డేంజర్ గురూ..

చలికాలంలో వేడినీటి స్నానాన్నే అందరూ ఇష్టపడుతుంటారు. కానీ వేడినీటి స్నానం మంచిది కాదు. ఇది చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం అయిన తర్వాత చర్మం కొంచెం తడిగా

మంగళవారం, 13 డిశెంబరు 2016 (12:51 IST)
చలికాలంలో వేడినీటి స్నానాన్నే అందరూ ఇష్టపడుతుంటారు. కానీ వేడినీటి స్నానం మంచిది కాదు. ఇది చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం అయిన తర్వాత చర్మం కొంచెం తడిగా ఉన్నప్పుడే పెదవులకు, ఒంటికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. అధిక గాఢత కలిగిన సాధారణ సబ్బులను ఉపయోగించకూడదు.
 
చలికాలంలో కూడా ఎండతీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అది ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు. అందుకే సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పకుండా రాసుకోవాలి.  సాధ్యమైనంత వరకూ మీ చర్మతత్వాన్ని బట్టి క్రీమ్స్‌ ఎంచుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. శీతాకాలంలో వాతావరణం తేమగా ఉండటం ద్వారా నీరు తాగాలని అనిపించదు. కానీ నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అప్పుడే చర్మంలోని మలినాలు తొలగిపోవడమే కాకుండా చర్మం తాజాగా తయారవుతుంది. దీనికితోడు వ్యాయామం కూడా కంపల్సరీగా చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించాలి. భోజనంలో తాజా పళ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. చలిలో సాధ్యమైనంతవరకు చర్మాన్ని బయటి వాతావరణంతో కనెక్ట్‌ కాకుండా చూసుకోవాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. పౌడర్ల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. 

అన్నీ చూడండి

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

NEET-UG 2026: నీట్ రద్దు.. అందుబాటులోకి రీఫండ్ సదుపాయం.. చివరి గడువు మే 27, 2026

సీఎం విజయ్‌ సలహాదారులలో తెలుగు వ్యాపారవేత్త విష్ణువర్ధన్ రెడ్డి

ఇరాన్‌పై భీకర దాడులకు అమెరికా ప్లాన్... కుమారుడి పెళ్లికి దూరంగా ట్రంప్

విమాన ప్రయాణాలకు పవన్ సొంత డబ్బునే వాడతారు.. జగన్‌కు షాకిచ్చిన నాదెండ్ల

అన్నీ చూడండి

మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ న‌టించిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ పేట్రియాట్. స్ట్రీమింగ్

Vijay Antony,: ఫీల్ గుడ్ ఎమోషన్‌తో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి

ఎ.పి. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పి.భరత్ భూషణ్, డైరెక్టర్ గా చదలవాడ శ్రీనివాస్

Thaman: చెవిటి, మూగ అయిన ఇట్లు అర్జున తో ఫస్ట్ సింగిల్ చేయించిన ఎస్. థమన్‌

First Time Review: : ఏలియన్స్ అండ్ వర్తమానం అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఫస్ట్ టైమ్ మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments