శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: సోమవారం, 12 జూన్ 2017 (14:44 IST)

లేడీ డైరెక్టర్ 'వండర్ వుమెన్' 7 రోజుల్లో రూ.2700 కోట్లు... దిమ్మరపోతున్న రాజమౌళి-ప్రియాంక

రాజమౌళి బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 50 రోజులకు చేరువవుతుందనగా రూ. 2000 కోట్లను చేరుకుంటోంది. ఐతే రాజమౌళితో పాటు ప్రపంచంలోని దర్శకులంతా దిమ్మరపోయే వండర్ ఒకటి జరిగింది. అదే వండర్ వుమెన్ సునామీ కలెక్షన్ల రికార్డు.

హాలీవుడ్‌లో విడుదలైన వండర్ వుమెన్ కేవలం మూడు రోజుల్లో రూ. 1435 కోట్లు వసూలు చేసింది. 7 రోజుల్లో రూ. 2700 కోట్లు వసూలు చేసి ప్రపంచాన్ని ఔరా అనిపిస్తోంది. క్రేజీ స్టార్లు లేకపోయినా కేవలం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఈ స్థాయి విజయాన్ని చవిచూడటంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
లేడీ డైరెక్టర్ ప్యాటీ జెన్కిన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఇజ్రాయెల్ నటీమణి గాల్ గడోట్ నటించింది. వండర్ వుమెన్ చిత్రం దెబ్బకు ప్రియాంకా చోప్రా బేవాచ్ బోర్లా పడిపోయింది. టామ్ క్రూయిస్ నటించిన ద మమ్మీ చిత్రం కూడా చతికిలపడింది.