శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (21:56 IST)

ఎసిడిటీ యమ డేంజర్ గురూ... గ్యాస్‌తో జ్ఞాపకశక్తి నాస్తి...

పొట్టలో మంటగా ఉంటే అశ్రద్ధ చేయవద్దంటున్నారు వైద్యులు. దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు మెదడు కూడా దెబ్బ తింటుంది. ఎందుకుంటే వేళకి సరిగ్గా తినకపోవడం లేదా చాలా తక్కువ తినడం వల్లే పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా గ్యాస్ మంట వస్తాయి. దీనివల్ల

పొట్టలో మంటగా ఉంటే అశ్రద్ధ చేయవద్దంటున్నారు వైద్యులు. దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు మెదడు కూడా దెబ్బ తింటుంది. ఎందుకుంటే వేళకి సరిగ్గా తినకపోవడం లేదా చాలా తక్కువ తినడం వల్లే పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా గ్యాస్ మంట వస్తాయి. దీనివల్ల మెదడుకి అందాల్సిన ఆహారం అందకపోవడంతో పాటు గ్యాస్ కారణంగా జ్ఞాపకశక్తికి సంబంధించిన నాడీ కణాల పనితీరు పూర్తిగా దెబ్బ తింటుందని జార్జియా మెడికల్ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఆహారం లేకపోవడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడితే  మెదడుకే ప్రమాదం. అంటే మెదడుకే మోసం వస్తుందన్న విషయాన్నిగుర్తించి ముందుగానే జాగ్రత్తపడటం ఎంతైనా మంచిది.
 
తీసుకోవలసిన  జాగ్రత్తలు
1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్‌లో ఉంటుంది.
 
2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది.
 
3. ఉదయాన్నే అరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది.
 
4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
 
5. గోరు వెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.