కొవ్వును నియంత్రించే బేబీకార్న్‌తో కుర్మా చేయడం ఎలా?

జీర్ణక్రియను మెరుగుపరిచే బేబీ కార్న్ కొవ్వును నియంత్రిస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి బేబీ కార్న్‌తో కుర్మా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలకు ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. ఎలా చేయాలో

గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:54 IST)
జీర్ణక్రియను మెరుగుపరిచే బేబీ కార్న్ కొవ్వును నియంత్రిస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి బేబీ కార్న్‌తో కుర్మా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలకు ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
బేబీ కార్న్ - రెండు కప్పులు
నూనె - సరిపడా
ఉల్లి తరుగు - ఒక కప్పు 
టమోటా తరుగు - ఒక కప్పు 
పెరుగు - ఒక కప్పు 
మొక్కజొన్న పిండి - రెండు చెంచాలు
కొత్తిమీర - రెండు రెమ్మలు
ఉప్పు -  కావలసినంత
కారం - తగినంత
చక్కెర-చిటికెడు 
పసుపు-అరచెంచా
పచ్చిమిర్చి-మూడు
 
తయారీ విధానం : 
ముందుగా ముక్కల్ని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి పక్కనబెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో నూనె పోసి ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా తరుగు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత ఉడికించిన కార్న్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, చక్కెర వేసి మూతపెట్టాలి. 5 నిమిషాల తర్వాత దానిలో తగినంత నీరు చేర్చి పావు కప్పు పెరుగు చేర్చుకోవాలి. ఈలోగా మొక్కజొన్న పిండిని రెండు చెంచాల నీటితో జారుగా కలుపుకోవాలి. దీన్ని కూడా బేబీ కార్న్ ముక్కలకు పట్టించాలి. గ్రేవీలా తయారయ్యాక దించేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే.. బేబీ కార్న్ కుర్మా రెడీ. 

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments