శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (13:21 IST)

పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృత్యువాత

peru bus accident
పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ అమెరికా ఖండమైన పెరూలో ఆదివారం ఉదయం ఘోర విపత్తు జరిగింది. పెరూ దేశ రాజధాని లిమాలో కొతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి భారీ లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే 24 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. డెవిల్స్ కర్వ్‌గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 24 మంది చనిపోయినట్టు సహాయక సిబ్బంది వెల్లడించింది. మృతుల్లో కరేబియన్ దేశమైన హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దుల్లోని టుంబేస్‌కు చేరుకోవాల్సి వుంది. కానీ, బస్సు ఆర్గానోస్ నగరం సమీపంలోని కొండపై ఉండే ప్రమాదకరమలుపు నుంచి పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.