సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (19:53 IST)

ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పేలుడు.. 39 మంది మృత్యువాత

blast
పాకిస్థాన్‌లో విషాదకర ఘటన జరిగింది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ ఫక్తుంఖ్వాలో జరిగిన ఓ బాంబు పేలుడులో 39 మంది మృత్యువాతపడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. జమైతా ఇ ఇస్లామ్ ఎఫ్ పార్టీకి చెందిన సుమారుగా 400 మంది కార్యకర్తలు రాజకీయ సమావేశం కోసం ఒకచోట చేరివుండగా, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. ఇందులో 39 మంది చనిపోయారు. 
 
దీనిపై ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి రియాజ్ అన్వర్ స్పందిస్తూ, ఆస్పత్రిలో 39 మృతదేహాలు ఉన్నాయని తెలిపారు. మరో 123 మంది గాయపడ్డారని వెల్లడించారు. వీరిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే, ప్రావిన్షియల్ గవర్నర్ హాజీ గులాం అలీ కూడా మృతుల సంఖ్యను నిర్ధారించారు. కాగా బాంబు పేలుడు ప్రదేశంలో స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ బృందాలు, వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు.