శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (15:18 IST)

పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఇండియన్ ఆర్మీ కాల్పులు.. ఏడుగురు పాక్ సైనికులు మృతి

పాకిస్థాన్ సరిహద్దు రేఖ వద్ద భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు పాక్ రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగినట్లు సమాచారం. పా

పాకిస్థాన్ సరిహద్దు రేఖ వద్ద భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు పాక్ రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగినట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భింబర్ సెక్టార్‌లో ఎల్‌ఒసి వెంబడి భారత బలగాలు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడిందని పాక్ సైనికాధికారులు ఆరోపించారు.
 
కాగా.. పాకిస్థాన్‌ను ఇండియన్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఏడుగురు పాక్ సైనికులను హతమార్చింది. అయితే బీంబెర్ సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని తెలిపింది. అయితే దీన్ని ఇండియన్ ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు.
 
పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపినప్పటి నుంచీ పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒఫ్పందానికి తూట్లు పొడుస్తూ వందల సార్లు కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో.. ఈ కాల్పులను తిప్పికొట్టే క్రమంలోనే భారత సైనికులు ఏడుగురు పాక్ సైనికులను హతమార్చినట్లు తెలుస్తోంది.