ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (15:44 IST)

590 అడుగుల ఎత్తులో నిలబడి వివాహం చేసుకున్నారు.. ఎక్కడ..?

చైనాలో ఓ యువ జంట 590 అడుగుల ఎత్తులో నిలబడి వివాహం చేసుకున్నారు. చైనాలో కొత్తగా నిర్మితమైన అద్దాల బ్రిడ్జి కింద.. వేలాడుతూ.. పెళ్లి చేసుకున్నారు. అద్దాల బ్రిడ్జి నిర్మితమై రోజులే గడిచిన నేపథ్యంలో.. ఓ ప

చైనాలో ఓ యువ జంట 590 అడుగుల ఎత్తులో నిలబడి వివాహం చేసుకున్నారు. చైనాలో కొత్తగా నిర్మితమైన అద్దాల బ్రిడ్జి కింద.. వేలాడుతూ.. పెళ్లి చేసుకున్నారు. అద్దాల బ్రిడ్జి నిర్మితమై రోజులే గడిచిన నేపథ్యంలో.. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో మిర్రర్ బ్రిడ్జి కింద వేలాడుతూ కొత్తగా ఆ జంట పెళ్లి చేసుకుంటుంటే.. చూసేవారంతా థ్రిల్లింగ్‌కు గురయ్యారు. కొందరైతే షాకయ్యారు. బ్రిడ్జి కింద తేలే వేదికను ఏర్పాటు చేసి.. అందులో ఇద్దరూ నిల్చుని రింగులు మార్చుకుని పెళ్లి తంతు కానిచ్చారు.
 
ఇదిలా ఉంటే.. ఈ మధ్య పెళ్ళిళ్లు వినూత్నంగా జరుగుతున్నాయి. ఆకాశంలో తేలియాడుతూ.. సముద్రంపై తేలియాడుతూ పెళ్ళిళ్లు జరుగుతున్నాయి. ఇటీవలే 90 మీటర్ల ఎత్తున తాళ్ల సాయంతో గాల్లో వేలాడుతూ మరాఠీ ఈ జంట ఒక్కటైంది. పూజారి కూడా వీరి కోసం రోప్ వే ద్వారా వారికి దండలు అందించి.. గాల్లో వేలాడుతూ.. పెళ్ళి తంతు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.