మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (16:42 IST)

కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికాడు.. అడవిలో పారేశాడు..

కుమార్తెతో జరిగిన వాగ్వివాదంలో కసాయి తండ్రి దారుణ హత్యకు పాల్పడ్డాడు. టర్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన హసన్ అనే వ్యక్తి తన కుమార్తె తిమెన్‌తో కలిసి జీవిస్తున్నాడు. హసన్ కసాయిగా పనిచేస్తున్నాయి. థిమెన్ డ్యాన్సర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఒక దశలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. చివరికి హసన్ కుమార్తెను కసాయి కత్తితో నరికి ముక్కలు ముక్కలు చేశాడు. ఆమె శరీర భాగాలను అడవిలో పారేశాడు. చాలా రోజుల తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి కేసుపై దర్యాప్తు మొదలెట్టారు. చివరికి కూతురిని చంపిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.