శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (14:51 IST)

బొమ్మ తుపాకీతో బెదిరించాడు.. దొంగకు కిక్‌లతో చుక్కలు

ఎదుటివారి బలం తెలియకుండా వారితో పెట్టుకుంటే ఇంతే జరుగుతుందనేందుకు ఈ ఘటన నిదర్శనం. ఓ దొంగ బొమ్మ తుపాకీతో ఓ యువతిని బెదిరించి దోచుకోవాలనుకున్నాడు. అంతే.. ఆ యువతి ఆ దొంగకు చుక్కలు చూపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మేడమ్ టైమెంత అడిగి దగ్గరకు వెళ్లాడు. తర్వాత మొబైల్, పర్సు ఇచ్చేయాలని బొమ్మ తుపాకీతో హెచ్చరించాడు. 
 
అయితే అక్కడే సదరు దొంగకు ఊహించని షాక్ తగిలింది. సదరు యువతి పోల్యానా వైనా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కావడంతో ఆ దొంగ షేపులు మారిపోయాయి. అంతే ఆ యువకుడిని యువతి చితక్కొట్టింది. తర్వాత పోలీసులకు అప్పగించింది. 
 
ఈ ఘటన బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు తొలుత సదరు దొంగను ఆస్పత్రికి తరలించారు. ఆపై స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.