శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (12:08 IST)

నా హృదయాన్ని ఆమె దొంగిలించింది... వెతికిపట్టుకోండి: పోలీసులకు యువకుడి ఫిర్యాదు

ఆ యువతి తన హృదయాన్ని దొంగిలించిందంటూ ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక చేతులెత్తేశారు. ఇంతకీ ఆ యువకుడు అలాంటి ఫిర్యాదు ఎందుకు చేశాడో ఓసారి తెలుసుకుందాం. 
 
నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఆమె హ్యాండిచ్చింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించి, తన హృదయం కనిపించడం లేదనీ, ఓ యువతి దొంగిలించిందని ఫిర్యాదు చేశాడు. ఆమెను వెతికి పెట్టాల్సిందిగా అందులో పేర్కొన్నాడు. 
 
ఆ యువకుడు చేసిన ఫిర్యాదుతో తొలుత బిత్తరపోయిన పోలీసులు... ఆ తర్వాత తేరుకుని ఆ యువకుడుని కూర్చోబెట్టి విచారించారు. కానీ, ఆ యువకుడు ఫిర్యాదు చేసినట్టుగా దీనిపై కేసు నమోదు చేయలేమని, ఆ యువతిని కూడా వెతికి పట్టుకోలేమని తెగేసి చెప్పాడు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.