1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 జులై 2025 (12:46 IST)

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

Plane crash on road
ఇటలీ లోని బ్రెస్సియా సమీపంలోని హైవేపై చిన్న విమానం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. గాలిలో వెళ్తున్న విమానం అదుపు తప్పి అకస్మాత్తుగా ట్రాఫిక్‌లోకి జారి రోడ్డుపై కూలిపోయింది. దీనితో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఆ మంటల్లో చిక్కుకున్నాయి.
 
ఈ ప్రమాదంలో పైలట్, ఒక ప్రయాణీకుడు శిథిలాలలో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. వీరు గుర్తించలేనంతగా కాలిపోయినట్లు స్థానికులు తెలియజేసారు.