శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (19:08 IST)

వామ్మో.. భారీ అనకొండ మొసలిని చుట్టేసి మింగేస్తోందే.. వీడియో

Anaconda_alligator
భారీ అనకొండ మొసలిని చుట్టేసి మింగేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లోని కండొమినియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఓ సంస్థ వీడియోను షేర్ చేసింది. షేర్ చేసిన గంటల్లోనే ఈ వీడియో విపరీతంగా షేర్ అయ్యింది. ఈ ట్వీట్‌లో పోస్టు చేసిన వీడియోలో  దాదాపు ఆరడుగుల పొడవు ఉన్న అనకొండ మొసలిని పూర్తిగా చుట్టేసినట్లు కనిపిస్తోంది.
 
అది గమనించిన స్థానికులు తాడుతో ఆ రెండింటిని విడిపించే ప్రయత్నం చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకు వేల్లో వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ప్రకృతి సహజంగా జరుగుతున్న ఈ దృశ్యం.. వాటి ఆహార గొలుసులో భాగం అంటూ సదరు సంస్థ వెల్లడించింది. ఈ వీడియోపై జనాలు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రజలు ప్రకృతిని గౌరవించడం లేదంటూ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.