గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (14:17 IST)

అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేస్తారు: టోనీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవికి త్వరలో రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితుడు, స్నేహితుడు ట్విట్టర్లో పేర్కొనడం ప్రస్తుతం కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి.. వైట్ హౌస్ ను

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవికి త్వరలో రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితుడు, స్నేహితుడు ట్విట్టర్లో పేర్కొనడం ప్రస్తుతం కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి.. వైట్ హౌస్ నుంచి బయటికి రానున్నారని ట్రంప్ స్నేహితుడు టోనీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈయన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకం రాసేందుకు సహకరించారు.
 
ట్రంప్ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి. ఈ నేపథ్యంలో టోనీ తన ట్విట్టర్ పేజీలో ఇంకా కొన్ని వారాల్లోపు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తి కాని తరుణంలో ట్రంప్ తప్పుకోనున్నారని వార్తలు రావడం అందరికీ షాక్ నిచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు ట్రంప్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.