శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2024 (13:11 IST)

Shiva Rajkumar: శివ రాజ్‌కుమార్‌‌కు అమెరికాలో శస్త్రచికిత్స.. నిలకడగా ఆరోగ్యం

Shiva Rajkumar
Shiva Rajkumar
శాండల్​వుడ్ స్టార్​ హీరో శివ రాజ్‌కుమార్‌ తాజాగా అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. మూత్రాశయానికి సంబంధించిన క్యాన్సర్‌ను తొలగించినట్లు ఆయనకు ఆపరేషన్ చేసిన సర్జన్ వీడియో మెసేజ్​ ద్వారా తెలిపారు. 
 
శివ రాజ్​కుమార్ ఫ్యామిలీ కూడా ఓ ప్రకటన ద్వారా ఆయన హెల్త్​ అప్​డేట్ పంచుకున్నారు. ఆయన ప్రేగులను ఉపయోగించి ఓ కృత్రిమ మూత్రాశయాన్ని సృష్టించారని ఆ వైద్యుడు పేర్కొన్నారు. మరోవైపు శివ రాజ్​కుమార్ ఫ్యామిలీ కూడా ఓ ప్రకటన ద్వారా ఆయన హెల్త్​ అప్​డేట్ పంచుకున్నారు. 
 
"బుధవారం ఆయనకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నెమ్మదిగా ఆయన కోలుకుంటున్నారు." అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రీసెంట్ మూవీ 'భైరతి రంగల్' ప్రమోషన్స్​ టైమ్​లోనే శివ రాజ్‌కుమార్‌ తొలిసారి తన అనారోగ్య సమస్య గురించి మాట్లాడారు. 
 
ప్రస్తుతం శివరాజ్ కుమార్ అప్​కమింగ్ మూవీస్ చూసుకుంటే భైరవుడు, ఉత్తరకాండ, 45, RC 16 చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం రెస్ట్‌ తీసుకుని ఆయన తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సినీ వర్గాల సమాచారం.