మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జులై 2025 (19:51 IST)

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

astronomer ceo aundy birani
ఓ సంగీత విభావరిలో నిమగ్నమైపోయిన ఓ కంపెనీ సీఈవో... సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ సీఈవో పేరు ఆండీ బిరానీ. ఆస్ట్రానమర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి. ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ కోల్డ్ ప్లేకు వెళ్లిన ఆయన తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ అకస్మాత్తుగా ఆమెకు ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సివచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కంపెనీ హెస్ఆర్ విభాగంలోని చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోటు ఆండీ ఆలింగనం చేసుకొని.. ముద్దాడుతూ ఫాకో బోర్గ్ గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో కెమెరా కంటపడ్డారు. దీంతో వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో వ్యాఖ్యాత "వారు అఫైర్‌లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలి" అని కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బిరానీని సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్ ప్రకటించింది. దీంతోపాటు సదరు మహిళా ఉద్యోగిని మానవ వనరుల విభాగం వైస్ ప్రెసిడెంట్ కాదని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ శనివారం అధికారికంగా ప్రకటించింది. 
 
“మా కంపెనీ లీడర్లు నడవడిక, బాధ్యత విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తాం. ఇటీవల ఆ స్థాయి ప్రమాణాలను నిలబెట్టుకోలేదు. ఆండీ తన రాజీనామా సమర్పించారు. దీనిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు" అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
కాగా, బుధవారం గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ కాన్సర్ట్‌లో స్పాట్లెట్‌ను ప్రేక్షకులపై వేస్తుండగా.. సన్నిహితంగా ఉన్న 'కాబోట్-ఆండీ' దొరికారు. దీంతో ఇద్దరూ ముఖం దాచుకొని ప్రేక్షకుల్లో కలిసిపోయారు. ఇద్దరూ హైప్రొఫైల్ వ్యక్తులు కావడంతో ప్రేక్షకులు వెంటనే గుర్తించారు. వీరిద్దరు అప్పటికే వివాహితులు. ఆస్ట్రానమర్ సీఈవో ఆండీకి మేగన్ కెర్రిగాన్‌తో ఇప్పటికే పెళ్లైంది. ఇక క్రిస్టిన్ కాబోటు ప్రైవేటీర్ రమ్ సీఈవో ఆండ్రూ కాబోట్తో వివాహం జరిగింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టడంతో ఇది వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నట్టు తేలింది. దీంతో ఆండీ బిరానీ తన పదవికి రాజీనామా చేశాడు.