బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (13:34 IST)

ఆగ్నేయ బ్రెజిల్‌‌లో ఘోరం.. ఆనకట్ట కుప్పకూలింది.. 200 మంది?

ఆగ్నేయ బ్రెజిల్‌, మినాస్ గెరాయిస్ రాష్ట్రంలోని బెలో హారిజాంటేలో ఆనకట్ట కుప్పకూలడంతో 200 మంది గల్లంతయ్యారు. గ్రామాలు నీట మునగడంతో ప్రజలు చాలామంది కొట్టుకుపోయారు. డ్యామ్ కెఫెటేరియాలో లంచ్ చేస్తున్న కార్మికులు నీటిలో కొట్టుకుపోయారు. 
 
బురద వారిని కప్పేసింది. వరదలా దూసుకొచ్చిన బురద తాకిడి వల్లే ఆనకట్ట కుప్పకూలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం హెలికాఫ్టర్ల సాయంతో గాలిస్తున్నారు.