సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (12:45 IST)

లైవ్ ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన సింగర్.. ఎక్కడ?

PedroHenrique
బ్రెజిల్ దేశంలో విషాదం జరిగింది. బ్రెజిల్ గోస్పెల్‌లో మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పేరుకెక్కిన పెడ్రో హెన్రిక్ ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. లైవ్ ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 30 యేళ్ళ అతి పిన్న వయుసులోనే ఆయన అలా మరణించడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. ముఖ్యంగా, ఈ ప్రదర్శనను తిలగించేందుకు వచ్చిన అనేక మంది శ్రోతలు కంట కన్నీరు కార్చారు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
కాగా, సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న వీడియోలో ప్రకారం... బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ వేదికపై లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రేక్షకులను కలుసుకునేందుకు స్టేజీ చివరకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోవడంతో అతని తల నేలకు బలంగా తగిలింది. ఆ వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. గుండెపోటు రావడంతోనే అలా జరిగిందని వైద్యులు వెల్లడించారు. 

ఎన్నికల్లో గెలుపు కంటే నిజం చెప్పి ఓడిపోవడమే మంచిది : వివేక్ రామస్వామి 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిజం చెప్పి ఓడిపోవడమే మంచిదని వివేక్ రామస్వామి అన్నారు. వచ్చే యేడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా, ఆయన ఐయోనా రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల నుంచి వివిధ రకాలైన ప్రశ్నించారు. ఒక హిందువు అమెరికా అధ్యక్షుడు కాలేరు అంటూ ఓ ఓటరు ప్రశ్నించాడు. దీనికి వివేక్ రామస్వామి తనదైనశైలిలో బదులిచ్చి ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకున్నారు. 
 
ఆ ఓటరు అడిగిన ప్రశ్నకు వివేక్ సమాధానమిస్తూ, "ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నా. ఎన్నికల్లో గెలుపు కంటే నిజం చెప్పి ఓడిపోవడమే నయమని నేను అనుకుంటున్నా. నేను హిందువుని. చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూళ్లల్లో చదువుకున్నా. రెండు మతాల్లోనూ ఒకే తరహా విలువలు ఉన్నాయని నేను నమ్మకంగా చెబుతున్నా. దేవుడు ప్రతి ఒక్కరిని ఓ కారణంతో ఈ భూమ్మీదకు పంపించాడని నా మతం చెబుతోంది. 
 
ఈ బాధ్యతను నిర్వర్తించాల్సిన నైతిన బాధ్యత మనందరిపైనా ఉంది. దేవుడు మనందరిలో ఉన్నాడు కాబట్టి మనుషులందరూ సమానమే. భగవంతుడు ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తాడు. దైవసంకల్పం మనం పాటించాల్సిందే. అందుకే మొదట ఓల్ట్ టెస్టమెంట్ వచ్చింది. ఆ తరువాత బుక్ ఆఫ్ ఇసాయా. ఆ సందర్భంలో దేవుడు సైరస్కు యూదులను తమ పవిత్ర ప్రాంతానికి తరలించే అవకాశం ఇచ్చాడు. కాబట్టి, దేవుడు నాకూ ఓ లక్ష్యం ఇచ్చాడని నమ్ముతున్నాను. ఆ నమ్మకమే నన్ను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేలా చేసింది అని వివేక్ చెప్పుకొచ్చాడు.