ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (10:41 IST)

మొసలి గుడ్లు అలా చేశాడు.. 40 మొసళ్లు దాడి.. వృద్ధుడి మృతి

crocodile
మొసలి గుడ్లు తీసుకోవడం ప్రయత్నించిన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒకటి కాదు ఏకంగా 40 మొసళ్లు దాడికి పాల్పడ్డాయి. దీంతో తీవ్రగాయాల పాలైన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కంబోడియాలో చోటుచేసుకుంది.
 
కంబోడియాలోని ఫనోమ్​ పెన్హ్​లో 72 ఏళ్ల వ్యక్తి ఎన్ క్లోజర్​లోని మొసలి గుడ్లను బయటకు తీసే క్రమంలో గుడ్ల దగ్గర ఉన్న మొసలిని బయటకు పంపేందుకు కర్రతో పొడిచాడు.
 
కర్రను మొసలి నోటితో లాగడంతో ఎన్​క్లోజర్​లో పడిపోయాడు. దీంతో 40 మొసళ్లు అతనిపై దాడి చేశాయి. బాధితుడి శరీరాన్ని చీల్చేశాయి. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు.