సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (17:50 IST)

దక్షిణ కొరియాకు చెందిన విమానం డోర్ గాలిలోనే తెరుచుకుంది..

South Korean flight
South Korean flight
దక్షిణ కొరియా ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ తెరుచుకుంది. రన్నింగ్‌లో ఓ ప్యాసింజర్ డోర్ తెరిచాడు. నిజానికి అత‌న్ని అడ్డుకునే ప్రయ‌త్నం చేసినా ఆ డోర్ కొద్దిగా ఓపెన్ అయ్యింది. ద‌క్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. 
 
ఏ321 విమానం గాలిలో వున్నప్పుడు ఈ డోర్ తెరిచింది. విమానంలో ఉన్న ప్రయాణికులు  భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌య్యారు. డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఉల్సన్‌లో జ‌రుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. 
 
శ్వాసకోస ఇబ్బందులు త‌లెత్తిన్న ప్రయాణికుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు ర‌వాణాశాఖ తెలిపింది. అయితే విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని.. చాలామంది ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.