శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (15:15 IST)

నాజీ జెండా ట్రక్కుతో వచ్చాడు.. జో-బైడన్‌ను హత్య చేయాలని..?

Joe Biden
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని హత్య చేయాలని భారత సంతతి యువకుడు ప్రయత్నించడం కలకలం రేపింది. వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాజీ జెండాతో ట్రక్కుతో వచ్చిన యువకుడు.. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన బారియర్స్‌ను ఢీకొట్టి ముందుకెళ్లాడు. అయితే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అతడు సదరు యువకుడిని భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. సాయివర్షిత్ లాఫాయోట్ పార్క్ వెలుపల వున్న బోలార్డ్‌లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో సాయి వర్షిత్ ఆరు నెలల పాటు అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
అతనిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపటం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నించడం. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్ కందుకూరు 2022లో మార్కెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లుగా గుర్తించారు. కానీ యువకుడు ఈ చర్యకు పాల్పడటానికి కారణాలు మాత్రం పోలీసులు తెలియజేయలేదు.