సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (17:11 IST)

వేలాది మొసళ్లు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది..

crocodiles
crocodiles
వేలాది మొసళ్లు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది.. అవును.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి ఘటన బ్రెజిల్ సముద్ర తీరంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఇటీవల బ్రెజిల్ బీచ్ పొడవునా వేల కొద్దీ మొసళ్లు ఒడ్డుకు వచ్చి నిలబడ్డాయి. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా బీచ్‌లో అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశాయి. ఈ మొసళ్లకు సంబంధించిన డ్రోన్ వీడియోను కెన్ రుట్‌కోవ్ స్కీ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
 
బ్రెజిల్‌ బీచ్‌లో వేల కొద్దీ మొసళ్ల ఆక్రమణ ఇదని.. భయం గొలిపేలా ఉన్న ఈ వీడియో త్వరగానే వైరల్‌గా మారింది. ఏకంగా 80 లక్షలకుపైగా వ్యూస్ నమోదు కాగా.. లక్షల కొద్దీ లైకులు వస్తున్నాయి.