శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (10:53 IST)

2017 సంవత్సరానికల్లా ఏనుగు దంతాల వ్యాపారంపై చైనా నిషేధం..

2017 సంవత్సరానికి కంటే వాణిజ్య అవసరాల నిమిత్తం ఏనుగుదంతాల శుద్ధి, విక్రయాలను క్రమంగా తగ్గిస్తూ పోతామని ఓ అధికారిక ప్రకటనను జిన్హువా వార్తా సంస్థ ఊటంకించింది. దీంతో ఏనుగు దంతం వ్యాపారంలో ప్రపంచంలోనే అగ

2017 సంవత్సరానికి కంటే వాణిజ్య అవసరాల నిమిత్తం ఏనుగుదంతాల శుద్ధి, విక్రయాలను క్రమంగా తగ్గిస్తూ పోతామని ఓ అధికారిక ప్రకటనను జిన్హువా వార్తా సంస్థ ఊటంకించింది. దీంతో ఏనుగు దంతం వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రగామిగా పేరుగాంచిన చైనా 2107 సంవత్సరానికల్లా వ్యాపారాన్ని నిషేధించనుంది.

ఈ నిర్ణయం పట్ల వన్యప్రాణి సంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రాత్మక చర్యగా పేర్కొంటున్నారు. అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్రికన్‌ గజరాజుల విషయానికి వస్తే... ఇదో గొప్ప చర్య అన్నది వారి అభిప్రాయంగా ఉంది. 
 
ఇదిలా ఉంటే.. ఆఫ్రికన్‌ అడవుల్లో ఏనుగు దంతాల వ్యాపారం చేస్తూ ఐవరీ క్వీన్‌గా పిలుచుకునే ఓ మహిళ తాజాగా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.  యాంగ్ ఫెంగ్ గ్లాన్ అనే మహిళ 15 ఏళ్లుగా స్మగ్లింగ్‌ చేస్తూ.. ఆఫ్రికా నుంచి 700 ఏనుగుల దంతాలు తరలించింది.

చైనా, ఆఫ్రికాల మధ్య ఈ స్మగ్లింగ్‌ వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో చైనాకు చెందిన పలువురు స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో యాంగ్ ఫెంగ్ పేరు బయటకు వచ్చింది. ఇలాంటి స్మగ్లింగ్‌కు చెక్ పెట్టాలనే దిశగా ఏనుగు దంతాలపై వ్యాపారాన్ని నిషేధించనున్నారు.