శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:57 IST)

క్యూబాలో రెండేళ్ల చిన్నారులకు కరోనా టీకాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అయితే టీకాలు వేసే విషయంలో క్యూబా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్యూబాలో రెండేళ్ల చిన్నారులకు కూడా కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు.

క్యూబాలో స్థానికంగా తయారు చేసిన రెండు రకాల టీకాలను వినియోగిస్తున్నారు. అయితే ఈ టీకాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యు‌హెచ్‌ఓ) గుర్తింపునివ్వలేదు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం క్యూబాలో... అబ్దలా, సోబర్నా అనే రెండు రకాల టీకాలను తయారు చేశారు. పిల్లలపై ఈ వ్యాక్సీన్ల క్లీనికల్ ట్రయల్స్ పూర్తయ్యింది.

దీంతో దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభించారు. ముందుగా 12 ఏళ్లు, అంతకుమించిన వయసుగల వారికి టీకాలు ఇస్తున్నారు.