చైనాలో మళ్లీ కరోనా... అదే వూహాన్‌లో 11 కేసులు.. లాక్‌డౌన్
కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరంలో మళ్లీ కోవిడ్-19 కేసులు నమోదైనాయి. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే చైనాలో 17 కేసులు నమోదైనాయి. దీంట్లో అయిదు కేసులు వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్ నగరంలోనే చోటుచేసుకున్నాయి.
చైనాలోని ఈశాన్యంలో ఉన్న జిలిన్ ప్రావిన్సులోని షూలన్ నగరంలో కొత్తగా ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో ఆ నగరాన్ని లాక్ డౌన్ చేశారు. ఈ కేసులన్నీ ఓ దోబీ మహిళకు లింకై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దోబీ వృత్తి చేపట్టే 45 ఏళ్ల మహిళ మొదట తన భర్తకు, సోదరులకు, ఆ తర్వాత ఫ్యామిలీ సభ్యులందరికీ వైరస్‌ను అంటించింది. వాస్తవానికి ఆమెకు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు.
వైరస్ కేసులు బయటపడడంతో షూలన్ నగరంలో ఉన్న అన్ని పబ్లిక్ స్థలాలను మూసివేశారు. నగరవాసులందర్నీ ఇంటికే పరిమితం కావాలంటూ ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపేశారు. ఆ నగరాన్ని హైరిస్క్ ప్రాంతంగా ప్రకటించారు. దోబీ వృత్తి చేసే మహిళకు వైరస్ సోకడంతో.. చైనాలోని సోషల్ మీడియాలో ఇదే చర్చాంశమైంది.