కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా 50లక్షల కేసులు.. 3,29,729 మంది మృతి
ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 50లక్షలు దాటాయి. అమెరికా సహా పలు దేశాల్లో ఉధృతి అలాగే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 50,89,923 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,29,729 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 20,23,472 మంది కోలుకున్నారు.
అగ్రరాజ్యం గత 24 గంటల్లో మొత్తం 15,93,031 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 94,941 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 3,70,778 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,79,524 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,888 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,96,958 మంది కోలుకున్నారు.
ఇటలీలో గత 24 గంటల్లో మొత్తం 2,27,364 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 32,330 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,32,282 మంది కోలుకున్నారు. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,48,293 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 35,704 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,150 మంది కోలుకున్నారు.
రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 3,08,705 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 2,972 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 85,392 మంది కోలుకున్నారు.