బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (11:17 IST)

రష్యా ప్రధానికి కరోనా పాజిటివ్... దేశంలో పెరిగిపోతున్న కేసులు

రష్యా ప్రధానిగా గత జనవరిలో బాధ్యతలు స్వీకరించిన మిషుస్తిన్, కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల్లో అత్యంత కీలక భూమికను పోషిస్తూ వచ్చారు. కానీ, చివరకు ఆయనే ఈ వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్‌కు వీడియో కాల్ చేసి... "ఇపుడు తెలిసింది.. నాకు జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్" అని వచ్చింది అని వెల్లడించారు. అలాగే, తన బాధ్యతలను ఉప ప్రధానిగా మొదటిస్థానంలో ఉన్న అండ్రే బెలౌసోవ్‌ను అప్పగించాల్సిందిగా ఆయన అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు.
 
మరోవైపు, గత 24 గంటల్లో రష్యాలో కొత్తగా 7,099 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,06,498కి చేరింది. ఈ వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,074 మంది మరణించారు. 
 
మొత్తం కేసుల సంఖ్యలో చైనా, ఇరాన్‌లను వెనక్కి నెట్టిన రష్యా లక్ష కరోనా పాజిటివ్‌లు దాటిన ఎనిమిదో దేశంగా నిలిచింది. అత్యధికంగా అమెరికాలో 10,64,572 కేసులు నమోదుకాగా, స్పెయిన్‌లో 2,36,899, ఇటలీలో 2,03,591, ఫ్రాన్స్‌లో 1,66,420