శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:24 IST)

కుప్పకూలిన పాక్‌ విమానం

పాక్‌ వైమానిక దళానికి చెందిన ఒక విమానం మంగళవారం అట్టాక్‌ ప్రాంతంలో కుప్పకూలింది. రోజువారీ శిక్షణా కార్యక్రమం జరుగుతుండగా విమానం ప్రమాదవశాత్తు కూలిపోయిందని, అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పాక్‌ వైమానిక దళం పేర్కొంది.

ఈ ప్రమాదం నుండి పైలెట్‌ తప్పించుకున్నారని, ఈ ఘటనపై బోర్డ్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ చేపట్టినట్లు తెలిపింది. కాగా, ఈఏడాదిలో ఇటువంటి విమాన ప్రమాదాలు జరగడం ఇది ఐదోసారి.