సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (14:34 IST)

డ్రోన్ ద్వారా డొమినో పిజ్జా డెలివరీ.. న్యూజిలాండ్‌లో తొలి ప్రయోగం సక్సెస్..

పిజ్జా ఆర్డర్ చేస్తే బైకుల సహాయంతో పిజ్జా బాయ్ డెలివరీ చేస్తాడు. అయితే పిజ్జా డెలివరీ చేయడానికి కనీసం అరగంటైనా పడుతుంది. అదీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మాత్రం చెప్పడం కష్టం. అలాంటి బాధ ఇక పడాల్సిన అవసరం లేద

పిజ్జా ఆర్డర్ చేస్తే బైకుల సహాయంతో పిజ్జా బాయ్ డెలివరీ చేస్తాడు. అయితే పిజ్జా డెలివరీ చేయడానికి కనీసం అరగంటైనా పడుతుంది. అదీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మాత్రం చెప్పడం కష్టం. అలాంటి బాధ ఇక పడాల్సిన అవసరం లేదు. పిజ్జా ప్రియులకు కొత్త మార్గం వచ్చేసిందని అంటున్నారు. ఎలాగంటే.. పిజ్జా ప్రియులకు తక్కువ టైంలోనే చేరవేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు పిజ్జా వ్యాపారులు. 
 
డ్రోన్‌ల ద్వారా వినియోగదారుల ఇళ్లకు వేగంగా పంపడానికి డ్రోన్‌లను ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా డొమినోస్ పిజ్జా సంస్థ డ్రోన్ ద్వారా ఓ వినియోగదారుడికి పిజ్జా డెలివరీ చేసింది. న్యూజిలాండ్‌లోని వాన్గాపారావుగా ప్రాంతంలోని ఒక వినియోగదారుడు చీజీ పిజాను ఆన్ లైన్‌లో ఆర్డర్ చేశాడు. డొమినోస్ ‘యూఏవి’ డెలివరీ సర్వీస్ ప్లర్టీ కలిసితో ఈ డెలివరీ పూర్తి చేశారు. మొదటి సారిగా డ్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు.