గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (06:43 IST)

రైలులో సీటివ్వలేదనీ ఆ మహిళ ఏం చేసిందో చూడండి.. (Video)

బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ప్రత్యేక బోగీలు ఉంటాయి. కానీ, సాధారణ బోగీల్లో మాత్రం వృద్ధులకైనా, మహిళలకైనా ప్రత్యేకించి సీట్లు ఉండవు.

బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ప్రత్యేక బోగీలు ఉంటాయి. కానీ, సాధారణ బోగీల్లో మాత్రం వృద్ధులకైనా, మహిళలకైనా ప్రత్యేకించి సీట్లు ఉండవు. 
 
చైనాలోని నాన్‌జింగ్ ప‌ట్ట‌ణంలో స‌బ్‌వే మెట్రోరైలులో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది. కాక‌పోతే ఇక్క‌డ దివ్యాంగుల సీటు కోసం మ‌హిళ, యువ‌కుడు వాదించుకున్నారు. ఎంత‌సేపు వాదించినా యువ‌కుడు సీటు ఖాళీ చేయ‌క‌పోవ‌డంతో మ‌హిళ అత‌ని మీద కూర్చుంది. 
 
ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక్క‌డ ప్ర‌త్యేక విష‌యం ఏంటంటే... ఆ మ‌హిళ‌, యువ‌కుడు ఇద్ద‌రూ విక‌లాంగులే కావడం గమనార్హం.