సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (13:01 IST)

నిందితుడికి జడ్జికి లవ్వాయణం.. జైలులోనే లిప్ లాక్ (వీడియో వైరల్)

ప్రేమ ఎవరికి ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. ధనవంతులకు, పేదలకు తేడా లేకుండా ఈ ప్రేమ పుడుతుంది. తాజాగా ఓ నిందితుడికి ఓ మహిళా న్యాయమూర్తికి ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఆ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
అందులో వారిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా చూడవచ్చు. మహిళా న్యాయమూర్తి ముద్దుపెట్టుకున్న ఖైదీ పోలీసు అధికారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అర్జెంటీనాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ చుబుట్ ప్రావిన్స్‌లో న్యాయమూర్తి అయిన మారియల్ సువారెజ్, డిసెంబర్ 29 మధ్యాహ్నం ట్రెలెవ్ నగరానికి సమీపంలో ఉన్న జైలులో క్రిస్టియన్ 'మై' బస్టోస్‌ను ముద్దుపెట్టుకోవడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. 2009లో అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్‌ను హత్య చేసినందుకు బస్టోస్‌కు జీవితకాలం జైలు శిక్ష విధించడం జరిగింది.