గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 జులై 2017 (13:06 IST)

ఇస్లామిక్ స్టేట్‌లో నవ్విస్తున్న జీహాదీలు.. ఎర్రటి లిప్‌స్టిక్‌లు, ప్యాడ్‌తో కూడిన బ్రా వేసుకుని..?

ఇస్లామిక్ స్టేట్‌లో జీహాదీ ఉగ్రవాదుల స్థావరాలపై ఇరాక్ సైన్యం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. దీంతో మోసుల్ పట్టణం నుంచి పారిపోయేందుకు జీహాదీలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక జీహాదీ మహిళ వేషంల

ఇస్లామిక్ స్టేట్‌లో జీహాదీ ఉగ్రవాదుల స్థావరాలపై ఇరాక్ సైన్యం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. దీంతో మోసుల్ పట్టణం నుంచి పారిపోయేందుకు జీహాదీలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక జీహాదీ మహిళ వేషంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఇరాక్ సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత అతని ఫొటోను విడుదల చేసింది. అతని ఫొటోను చూసినవారు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. 
 
ఈ ఫోటోలో ఉన్న జీహాదీ మహిళలా మేకప్ చేసుకుని.. పెదవులకు ఎర్రటి లిప్‌స్టిక్.. కళ్లకు కాటుక, గులాబీరంగు ఐషేడ్ వేసుకున్నాడు. అయితే తన మీసాలను, గెడ్డాన్నిఅలానే వదిలేశాడు. దీంతో దొరికిపోయాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఇదే తరహాలో మరో ఇద్దరు జీహాదీలు కూడా పట్టుబడ్డారు. ఒక జీహాదీ అయితే.. పెదవులకు లిప్ స్టిక్ రాసుకుని గడ్డం నీట్‌గా గీసుకున్నాడు. ప్యాడ్‌తో కూడిన బ్రా వేసుకున్నాడు. అయితే ఛాతీమీది జుట్టును అలానే ఉంచేసుకున్నాడు. ఇదంతా స్పష్టంగా కనిపించడంతో ఇరాక్ సైన్యానికి అడ్డంగా దొరికిపోయాడు. ఇదేవిధంగా బుర్కాలో తప్పంచుకోబోయిన మరో జీహాదీ కూడా పట్టుబడినట్లు ఇరాక్ సైన్యం వెల్లడించింది.