గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (10:00 IST)

అమెరికాలో గన్ కల్చర్ : ఐదుగురిని కాల్చి చంపారు...

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గన్‌కల్చర్ మరోమారు బుసకొట్టింది. ఓ ఉన్మాది బ్యాంకులోకి చొరబడి ఐదుగురుని కాల్చిచంపాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఫ్లోరిడా రాష్ట్రంలోని సెబ్రింగ్ ప‌ట్ట‌ణంలో ఉన్న స‌న్ ట్ర‌స్ట్ బ్యాంక్‌లోని జీఫెన్ జేవర్ అనే ఓ సాయుధ ఉన్మాది తుపాకీతో చొరబడ్డాడు. ఆ సమయంలో బ్యాంకులో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారందరినీ నేల‌పై పడుకోమ‌న్నాడు. ఆ త‌ర్వాత ఆ ఐదుగురిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు బ్యాంకుకు చేరుకోగానే ఉన్మాది లొంగిపోయాడు. 
 
ఆ నిందితుడు వీడియోను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఒర్లాండో న‌గ‌రానికి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ విషాద ఘ‌ట‌న ప‌ట్ల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌న్‌ట్ర‌స్ట్ బ్యాంక్ త‌న ట్వీట్‌లో వెల్లడించింది. ఉన్మాది జేవ‌ర్ గ‌తంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అయితే ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా అత‌న్ని ఆ ఉద్యోగం నుంచి తొల‌గించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతుల కుటుంబాలకు ఫ్లోరిడా గవర్నర్ సంతాపం తెలిపారు.