మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (18:55 IST)

భార్య పుట్టిన రోజును పొరపాటున మర్చిపోతే?

happy birthday
భార్య ఎప్పుడు భర్త ఇచ్చే బహుమతితో ఖరీదు చూడు ప్రేమను చూస్తుంది. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే భార్యలకి ఉన్న అదృష్టం ప్రత్యేకత ఉన్న రోజులను గుర్తు పెట్టుకోవడం. అందుకే భార్యలు భర్త పుట్టినరోజుని, పిల్ల పుట్టిన రోజుని, పెళ్లి రోజును అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ల పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టకోగలదు. 
 
కానీ భర్త తన భార్య పుట్టిన రోజును గుర్తు పెట్టుకోవాలని అనుకున్న పని హడావిడిలో మరిచిపోతుంటాడు. అయితే ఇకపై ఇవన్నీ కుదరదు. ఫసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవా అనే అందమైన ద్వీపం వుంది. ఇక్కడ ఎవరైనా వ్యక్తి తన భార్య పుట్టిన రోజును పొరపాటున మర్చిపోతే జైలు శిక్షపడుతుంది. 
 
తన భర్త తన పుట్టిన రోజుని మర్చిపోయారని భార్య ఫిర్యాదు చేస్తే... మొదటిసారి అయితే మళ్లీ ఈ తప్పును చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ ఈ రెండో సారి కూడా మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది.