బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (14:52 IST)

ఒక్క రేప్.. యుద్ధానికి సిద్ధమైన రెండు దేశాలు.. నేరాన్ని వర్ణించలేమన్న జడ్జి...

ఓ రేప్ కేసు చైనా, జర్మనీ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొల్పింది. ఈ కేసులో కోర్టు తాజాగా తుదితీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన జర్మనీకి చెందిన ఇద్దరు యువకులకు జర్మనీ కోర్టు జైలు శిక్ష విధి

ఓ రేప్ కేసు చైనా, జర్మనీ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొల్పింది. ఈ కేసులో కోర్టు తాజాగా తుదితీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన జర్మనీకి చెందిన ఇద్దరు యువకులకు జర్మనీ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చైనాకు చెందిన ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని(25)పై సెబాస్టియన్‌.ఎఫ్‌ (21)అనే యువకుడు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడటమేకాకుండా అతి క్రూరంగా చంపేశాడు. ఈ ఘటన గత యేడాది మే నెలలో పశ్చిమ జర్మనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై చైనా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ కేసు విషయంలో తమకు న్యాయం జరిగేవరకు ఎలాంటి సహాయ సహకారాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఉండబోవని చైనా ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనకు కారణమైన ఈ కేసులో జర్మనీ పోలీసులు శరవేగంగా స్పందించారు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఉదా షెమిడిట్‌.. ఈ నేరాన్ని వర్ణించలేమన్నారు. ఈ సందర్భంగా వారిలో ఒకరికి 15 ఏళ్ల జైలు శిక్ష, ఒకరు జువైనల్‌ కావడంతో ఐదున్నారేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు.