పబ్లిసిటీ కోసం రైలులో దుస్తులు విప్పేసిన యువతి.. ఎక్కడ?
పబ్లిసిటీ సంపాదించుకోవడం కోసం జనాలు ఎంతటి దారుణానికైనా సిద్ధపడుతున్నారు. కొందరు పబ్లిసిటి కోసం చేస్తున్న పనులను చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాదు. తాజాగా ఓ యువతి అందరూ చూస్తుండగానే తన బట్టలు ఒక్కొక్కటీ విప్పుతూ అందరిని అబ్బురపరిచింది. ఈ సంఘటన పశ్చిమ లండన్ ప్రాంతంలో ఓ ట్రైన్లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.... లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తోటివాళ్లతో మాట్లాడుకోరు.. సరికదా అసలు పక్కకి కూడా తిరిగిచూడరు. పుస్తకాలు చదువుకుంటూ, ఫోన్, ల్యాప్‌టాప్‌లతో ఎవరి పనిలో వారు నిమగ్నమైయుంటారు.
అయితే ఒక యువతి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుని అందరికి షాక్ నిచ్చింది. ఇంతకీ ఆమెవరో తెలుసా...ఓ స్ట్రిప్ డ్యాన్సర్. ఉదయం రష్ హవర్లో పశ్చిమ లండన్ ప్రాంతంలో ట్రైన్ ఎక్కింది. అందరూ ఈ ప్రపంచం గురించి పట్టించుకోకుండా చాలా బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ యువతి తన శరీరం పై ఉన్న ఒక్కో వస్త్రాన్ని విప్పేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు లోదుస్తులు మాత్రమే ఉంచుకుని పోల్ డ్యాన్స్ చేసింది. కాసేపు తర్వాత తన టాప్ కూడా విప్పేసి అందరికీ సెక్సీ లుక్స్ ఇస్తూ నానా హంగామా చేసింది. దీంతో అందరూ తమ పనులు వదిలేసి ఆమె వైపే కన్నార్పకుండా చూడడం మొదలెట్టారు.
ఈ తతంగాన్ని కొంతమంది తమ సెల్ఫోన్లో వీడియో తీసుకుంటున్న కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఆమెకు ఇదంతా కావాలని చేయలేదు. అదంతా ఓ పబ్లిసిటీ ట్రిక్కు. యూకేకు చెందిన ఓ లైఫ్‌స్టైల్ వెబ్సైట్ చేసిన ప్రచారం కోసం ఈ తతంగమంతా. ఆ యువతి డ్యాన్స్ చేయడం పూర్తయిన తర్వాత ఒక పెన్ను, పేపర్ తీసుకని అందరి వద్దకూ వెళ్లి సదరు వెబ్సైట్ గురించి నాలుగు వాఖ్యాలు రాయమని అడిగింది. దీంతో ఆ ట్రైన్‌లోని వారంతా ఆ సుందరి రిక్వెస్టు కాదనలేక వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా రాసిచ్చారు. మామూలుగా వెళ్లి అడిగితే ఎవరూ ఏమీ చెప్పరని, సదరు వెబ్సైట్ నిర్వాహకులు ఇలా ప్లాన్ చేశారట.