శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:57 IST)

ట్రక్ డ్రైవర్ వద్ద దారి అడిగిన పైలట్.. వీడియో చూడండి

ట్రక్‌ను నడిపే డ్రైవర్ వద్ద హెలికాప్టర్‌ను నడిపే పైలట్.. దారి అడిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కజగస్థాన్‌లో సైనిక హెలికాప్టర్ హైవేలో ల్యాండ్ అయ్యింది. ఈ హెలికాప్టర్‌ను నడిపిన ట్రైనీ

ట్రక్‌ను నడిపే డ్రైవర్ వద్ద హెలికాప్టర్‌ను నడిపే పైలట్.. దారి అడిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కజగస్థాన్‌లో సైనిక హెలికాప్టర్ హైవేలో ల్యాండ్ అయ్యింది. ఈ హెలికాప్టర్‌ను నడిపిన ట్రైనీ పైలట్.. దారెటో తెలియక దిక్కుతోచక.. హెలికాఫ్టర్ నుంచి దిగి.. ట్రక్ డ్రైవర్‌తో దారెటో చెప్పమని అడిగాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దారి తప్పిన కారణంగానే ట్రక్ డ్రైవర్ వద్ద హైవేస్‌లో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసి.. దారి అడిగినట్లు తెలుస్తోంది.
 
దీనిపై కజగస్థాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. సైన్యానికి సంబంధించిన హెలికాఫ్టర్లకు సరైన ప్రాంతాలు.. మ్యాప్ వివరాల గురించి తెలుసుకునే దిశగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సరైన ప్రాంతాలను ఎంచుకోవడం హెలికాఫ్టర్లను సమర్థవంతంగా నడపేందుకు ఈ శిక్షణ ఇస్తారని.. ట్రక్ డ్రైవర్ వద్ద దారెటో అడిగిన పైలట్.. ఈ శిక్షణలో ఉత్తీర్ణుడైనట్లు రక్షణ మంత్రి చెప్పారు.