శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (11:10 IST)

44 ఏళ్ల హిందూ మహిళ దయా బీల్ తల నరికి హత్య.. భారత్ మండిపాటు

పాకిస్తాన్ కు చెందిన 44 ఏళ్ల హిందూ మహిళ దయా బీల్ ను తల నరికి హత్య చేశారు. సింజిరో ప్రాంతంలోని పొలంలో ఆమె మృతదేహం కనిపించిందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సింధ్ మైనారిటీ సెల్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణకుమారి ట్వీట్ చేశారు.
 
నలుగురు పిల్లల తల్లి దయా బీల్ మే 27న బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దయా పీల్ కుమారుడు షూమర్ మాట్లాడుతూ, అతను రాకపోవడంతో తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళానని, చాలా గంటల వెతికిన తరువాత పొలంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నానని చెప్పాడు.
 
"అతని తల్లిని చంపిన తీరు మాకు బాధ కలిగించింది. ఈ క్రూరమైన దాడి ఈ ప్రాంతంలోని హిందూ సమాజంలో  భయాందోళనలను సృష్టించింది. పాకిస్తాన్ లో ఓ హిందూ మహిళ శిరచ్ఛేదం చేయడాన్ని భారత్ ఖండించింది.
 
పాకిస్తాన్ తన మైనారిటీలను రక్షించాలని, వారి ప్రయోజనాలు, భద్రతను రక్షించే బాధ్యతను నెరవేర్చాలని భారతదేశం గతంలో చెప్పిందని, ఇప్పుడు అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బక్షి విలేకరులతో అన్నారు.